పల్లవి:
దేవ నీవు నన్ను ఁ బరిశో ధించి బాగుగఁ దెలిసికొంటివి నీ వెఱుఁగు దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును ||దేవ||
1. నాకుఁ దలఁపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాఁడవు ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి ||దేవ||
2. నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము దేవ సర్వముఁ బూర్తిగా నీకే తెలియును ||దేవ||
3. నా వెనుకను ముందు నుండి నన్ను నావరిఁచి నీ చెయ్యి నీవు నాపయి నుంచితివి నా మది కది కేవల మందదు ||దేవ||
4. అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ సన్నిధి నుండి నే నెచ్చోటికిఁ బారిపోవుదు ||దేవ||
5. ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను ||దేవ||
6. నను సృజించిన తెఱఁగెఱుంగఁగ నాకు భయ మాశ్చర్య మొదవును గనుక నీకును నేఁ గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ||దేవ||
7. నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాఁడవు నేను బ్రతుకుట ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో ||దేవ||
8. నిక్కముగ దేవా నీ తలఁపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు నెక్కువౌ ||దేవ||
