కీర్తనలు

326. క్రీస్తును నమ్ముట

రాగం: ముఖారి|తాళం: ఆట|రచయిత: బుఱ్ఱారెడ్డి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం చుము వేగ ||నమ్మితి||
1.  పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు జేరిన నేను ||నమ్మితి||
2.  ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు కరుణాసముద్రుఁడ ||నమ్మితి||
3.  ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత దేవ కుమార ||నమ్మితి||
4.  దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక నన్ను ||నమ్మితి||