కీర్తనలు

298. యేసునొద్దకు రండి

రాగం: మధ్యమావతి|తాళం: ఆది|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను బ్రాణము ||రండి||
1.  మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన దరి ||రండి||
2.  మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును మెండగు దుఃఖము ||రండి||
3.  మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ దేవుఁడు ||రండి||