← కీర్తనలు

227. క్రీస్తు రెండవ రాకడ

రాగం: కమలామనోహరి|తాళం: ఆది|రచయిత: మిక్కిలి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని పేరఁ ||గోలాహలముగ||
1.  మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని మదివేడు ||కోలాహలముగ||
2.  పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై యుండలేదా ||కోలాహలముగ||
3.  ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర ||కోలాహలముగ||
4.  అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్ వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ రాఁడ ||కోలాహలముగ||
5.  ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని బాడు ||కోలాహలముగ||
6.  భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్ బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను జూడ ||కోలాహలముగ||
7.  భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు ||కోలాహలముగ||