← కీర్తనలు

226. క్రీస్తు ఆరోహణము

రాగం: ఆనందభైరవి|తాళం: త్రిపుట|రచయిత: తూలూరి ప్రకాశము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబు||
1.  యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు||
2.  గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు నా ప్రభువట్లెమరల యలర వచ్చుట మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబు||
3.  శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే ||మేఘంబు||