← కీర్తనలు

224. క్రీస్తు కడపటి హెచ్చరిక

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను బోదు సంతోషించు(డి ||ఇదిగో||
1.  యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు దిగివచ్చి పనులు దెల్పును ||ఇదిగో||
2.  దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ బరిశు ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||
3.  నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేల ||నిదిగో||
4.  ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు నిదియె సార మనుకొనుఁడి ||యిదిగో||
5.  ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని ముందే చేయుదును ||ఇదిగో||
6.  ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము మరువకుండుఁడి ||యిదిగో||