← కీర్తనలు

223. ప్రభుని ప్రత్యక్షతలు

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద వినరే ప్రియులార వాస్తవముగ మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ ||గ్రీస్తు||
1.  మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ ||గ్రీస్తు||
2.  సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు ||క్రీస్తు||
3.  తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి ||క్రీస్తు||
4.  సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ ||క్రీస్తు||
5.  ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ ||క్రీస్తు||
6.  హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము ||క్రీస్తు||