← కీర్తనలు

169. యేసు పాపికి ఆశ్రయుఁడు

రాగం: శంకరాభరణము|తాళం: అట|రచయిత: మిక్కిలి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే
1.  ఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు నీవే ||పాపి||
2.  అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే యేసు నీవే ||పాపి||
3.  చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే ||పాపి||
4.  రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే యేసు నీవే ||పాపి||
5.  నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే కరము చాఁపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే ||పాపి||
6.  శాత్రవాంతరమున మృతుఁడవు నీవే మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు నీవే యేసు నీవే ||పాపి||
7.  భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తుఁ జేయుము నీవే యేసు నీవే ||పాపి||