పల్లవి:
యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా దోషియైన నన్ను బ్రోవ నీసుప్రాణమిడితివా ||యేసురాజా||
1. మంచివాని కొరకు నొకఁడు మరణ మొందుటరుదుగా అంచితమగు ప్రేమ చేత మించి గాయము లొందినా ||వేసు||
2. చెయ్యరాని దుష్కర్మములుఁ చేసి నే చెడియుండగా అయ్యో మ్రానుమీఁ దికీవు ఇయ్యకొని మోసితివా ||యేసు||
3. గెత్సేమనె వనములోకిఁ జొచ్చి తండ్రికి చిత్తమై యిచ్చిన నా శ్రమలపాత్రన్ బుచ్చుకొని భరించినా ||వేసు||
4. హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో విస్తరించి చిందె నీ ప్ర శస్త రక్తమంతయున్ ||యేసు||
5. కొండమీద నిన్నుఁజూడ గుండెలదిరిపోవునే నిండు ప్రేమ చేత నావగు మెండుబాధల నోర్చినా ||వేసురాజా||
6. మరువలేను నీదు ప్రేమ మరణపరియంతంబు నా నరక బాధలన్ని నీవా కొరతపై వహించినా ||వేసురాజా||
7. నిన్నుదలఁచ నా నిరీక్షణ యున్నతము గానుండును యెన్నడు నీ మహిమను నా కన్నులారఁజూతునో ||యేసురాజా||
