165. యేసుని నిరుపమాన ప్రేమ

రాగం: ఆనందభైరవి • తాళం: అట • రచయిత: రావూరి రంగయ్య
పల్లవి:ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా ||ఈలాటిదా||
1. ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర కిందు వచ్చె ||ఈలాటి||
2. పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతిఁజూపించె ||ఈలాటి||
3. నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా చేయిబట్టి చక్కఁగా బిలిచె ||ఈలాటి||
4. పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె ||ఈలాటి||
5. నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటి||
6. శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ యేమందు ||ఈలాటి||