కీర్తనలు

157. వ్యాధి బాధితురాలిని స్వస్థపర్చుట

రాగం: ఆనందభైరవి|తాళం: కురుఝంపె|రచయిత: తూపిలి బెంజిమిన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ ||యేసు||
1.  గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను ||యేసు||
2.  అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు ||యేసు||
3.  ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె ||యేసు||
4.  ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు||
5.  ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును ||యేసు||