కీర్తనలు

149. క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ

రాగం: ఆనందభైరవి|తాళం: కురుఝంపె|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనినఁ పరలోక జీవంబు మన కబ్బును ||దేవుని||
1.  సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోఁ జేసెను సర్వోపకారుడుండే మన మీద జాలిపరుఁడై యుండెను ||దేవుని||
2.  మానవుల రక్షింపను దేవుండు తన కుమారునిఁ బంపెను మన శరీరముఁ దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుఁడే ||దేవుని||
3.  యేసుక్రీస్తను పేరున రక్షకుఁడు వెలసి నాఁడిలలోపల దోసకారి జనులతో నెంతోను భాషలను బల్కినాఁడు ||దేవుని||
4.  పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములఁ బొందెడి పాపులందఱు నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
5.  సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను సత్ప్రేమగ నడిచెను పరలోక సద్బోధలిక జేసెను ||దేవుని||
6.  చావు నొందిన కొందఱిన్ యేసుండు చక్కఁగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
7.  గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాఁడే మేలు గల యద్భుతములు ఈలాగు వేలకొలఁదిగ జేసెను ||దేవుని||
8.  చేతుల కాళ్లను రా రాజు చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
9.  ఒడలు రక్తము గారఁగ దెబ్బలు చెడుగు లందఱుఁ గొట్టిరి వడిముళ్లు తలమీఁదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
10.  ఇన్ని బాధలు బెట్టుచుఁ దనుఁ జంపు చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేఁడెను ||దేవుని||
11.  రక్షకుడు శ్రమఁ బొందఁగా దేశంబు తక్షణము చీఁక టయ్యెన్ రక్షకుఁడు మృతి నొందఁగఁ తెర చినిఁగి రాతి కొండలు పగిలెను ||దేవుని||
12.  రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును పాఁతి పెట్టిరి భక్తులు నమ్మిన నాతు లందఱుఁ జూడఁగా ||దేవుని||
13.  మూఁడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాఁడు నాఁడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్ ||దేవుని||
14.  పదునొకండు మారులు వారలకుఁ బ్రత్యక్షుఁ డాయె నేను పర లోకమున కేగెను తన వార్తఁ బ్రకటించు మని పల్కెను ||దేవుని||
15.  నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని||