కీర్తనలు

90. యేసుక్రీస్తుకు స్తుతి

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|ఛాయ: యేసునాధ కథా|రచయిత: మిక్కిలి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ దండ్రి దేవుని నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తు||
1.  సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు||
2.  నిమిషమైన ంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా ను క్రోశము హర్షముగ వర్ణింతును ||క్రీస్తు||
3.  యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ భజియంతు నిఁక నేఁ దప్పకుండను నీమము ||క్రీస్తు||
4.  చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు||
5.  మలినమౌ నా నత్తి నాల్క స మాధిలోఁ గృశియింపను బలిమితోనేఁ బాడుచుందును భక్తి యుజ్వలింపను ||క్రీస్తు||
6.  కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు శ్రీకర దేవ నను నీవేలను ||క్రీస్తు||
7.  ముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుఁడా యొగ్గుచేయక నన్నుఁ బ్రోవవే యేసునాధ మహేశుఁడా ||క్రీస్తు||
8.  భూతలములో నీ సమానముఁ బోల్చ నేదియుఁ గానము దాతవై మము సలుపవే నీ తండ్రికిని సంధానము ||క్రీస్తు||