కీర్తనలు

88. యేసును స్తుతించుట

రాగం: కానడ|తాళం: ఆది|రచయిత: ఇ.జి. ఆనందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||
1.  స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||
2.  ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||
3.  సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||