కీర్తనలు

87. క్రీస్తుకు నమోనమః

రాగం: శంకరాభరణము|తాళం: అట|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో ||
1.  దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో దేవా యేసావతార నమోనమో దేవా గావో ||
2.  దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో ||
3.  వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో ||
4.  శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో ||