← కీర్తనలు

82. యేసు నామ భజన

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: ఓగిరాల గాబ్రియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి వసుధ నెవ్వారినిఁ గానము ||యేసు||
1.  ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసు||
2.  శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ ||డేసు||
3.  అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి ||యేసు||
4.  మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ డు ||యేసు||