← కీర్తనలు

81. యేసు నామ భజన

రాగం: హిందూస్థాని తోడి|తాళం: ఆది|రచయిత: దొరసామి ఆరోగ్యము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు||
1.  దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజన||
2.  నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||
3.  చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ||భజన||
4.  ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు ||భజన||