← కీర్తనలు

76. క్రీస్తు యేసునకు మంగళహారతి

రాగం: ఆనందభైరవి|తాళం: అట చాపు|ఛాయ: తెలుగు తల్లికి వందనం|రచయిత: రవివర్మ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం||
1.  ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం||క్రీస్తు||
2.  జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం||క్రీస్తు||
3.  ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం||క్రీస్తు||
4.  మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం||క్రీస్తు||
5.  జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం||క్రీస్తు||