కీర్తనలు

75. క్రీస్తునకు మంగళ స్తోత్రము

రాగం: మారువ|తాళం: అట|ఛాయ: సందియము వీడవే|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ||
1.  ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ||
2.  సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ||
3.  ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి( జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు||మంగళ||