పల్లవి:
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా ||పరిశుద్ధ||
1. పరిశుద్ధ జనకుఁడ పరమాత్మరూపుఁడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ||పరిశుద్ధ||
2. పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ నరులను రక్షించు కరుణా సముద్రా ||పరిశుద్ధ||
3. పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానందప్రేమ భక్తుల కిడుమా ||పరిశుద్ధ||
4. జనక కుమారాత్మలను నేక దేవా ఘనమహిమ చెల్లును దనర నిత్యముగాఁ ||పరిశుద్ధ||
