కీర్తనలు

19. దేవుని మందిరావరణములు

రాగం: హిందుస్థాని ముఖారి|తాళం: జుల్వ|ఛాయ: సాక్ష్యమిచ్చెద|రచయిత: ఎం. జే రామాంజులు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా ||చూడ||
1.  నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు నానంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ||
2.  జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె గూటి తావు నీ మందిరమున ||చూడ||
3.  పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున ||చూడ||
4.  నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా ||చూడ||
5.  ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||
6.  నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ||
7.  కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ||