← కీర్తనలు

705. సిలువపై రక్షకుని ఏడు మాటలు

రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు ప్రభువు సిలువ మీద ఏడు మాటలు – ఆశతోడ బల్కెను- భాసురంపు పల్కులు – దాసజనులు దలపోయదండి ధైర్యమిచ్చును
1.  తండ్రీ వీరు చేసేదేమో – తెలియకున్నారు దండింప వద్దని దయతోడ వేడెను – నిండు జాలి శత్రువులపై మెండు తాల్మి జూపెను
2.  -చూడు నీవు పరమునందు నేడే యుందువు తడవేల నాతోడ నని తెల్పె దొంగతో కడుదీనత వేడ పాపిని కరుణ తోడ గాచెను
3.  అమ్మాయిదిగో నీ కుమారుడంచు తల్లితో నెమ్మితోయో హానును- నమ్మకంపు శిష్యుని – ఇమ్ముగా మరియమ్మ తల్లిగా సమ్మతితో జూపెను
4.  చెప్పరాని తాపమొంది గొప్ప బాధచే దప్పిగొనుచు న్నానని దండి కేక వేసెను – దప్పి బాధ తీర్చలేక చేదు చిరక నిచ్చిరి
5.  నాధా దేవ నాదు చేయి – నేల విడిచితి – నన్నేల వీడితి వని కేక వేసెను బాధలెంతో హెచ్చుకాగా బహుగా విలపించెను
6.  సకల వరుల రక్షణంబు – సిలువ యందున సమకూడె గావున – స్వామి యొక్క కార్యము – ఇక సమాప్తమైనదంచు వీకతో ప్రకటించెను
7.  తండ్రీ నాదు ఆత్మ నీకు నిండు ప్రేమతో అప్పగించుచున్నాని చెప్పి ప్రాణం వీడెను – మెండు శాంతి తోడ యేసు మెల్లగా నిద్రించెను