కీర్తనలు

666. ప్రాణప్రియునికి హృదయార్పణ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా ప్రాణప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
1.  అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బ..హు ప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||
2.  విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||
3.  గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||
4.  రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||
5.  నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తు... తుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||
6.  వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ ||నా ప్రాణ||