664. సర్వము యేసుకే!

పల్లవి:నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వము యేసుకే నాదు జీవము నాదు దైవము దివి దివ్య తేజము
1. కృంగినవేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను చుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చేసెను ||నాదు||
2. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||
3. కారుమేఘాలే క్రమ్మినవేళ నీతిసూర్చుడు నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావ త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో ||నాదు||