← కీర్తనలు

651. పునరుత్థానునికి జయగీతం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జయ జయ యేసు జయయేసు జయజయ క్రీస్తు జయక్రీస్తు జయజయరాజా జయరాజా జయజయస్తోత్రం జయస్తోత్రం ||జయ||
1.  మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు ||జయ||
2.  సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు ||జయ||
3.  సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు ||జయ||
4.  బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు ||జయ||
5.  ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు ముద్రలు జీల్చుము జయయేసు ముద్రించుమునను జయయేసు ||జయ||
6.  కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు సేవలో బలమును జయయేసు జీవమునీవే జయయేసు ||జయ||
7.  దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు కయ్యము కలిగిన జయయేసు అయ్యో నీవే జయయేసు ||జయ||