← కీర్తనలు

645. సువార్తికులకు పిలుపు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన్నులు తెరచి కానవేమయ్యా
1.  మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||
2.  ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి ||క్రైస్తవ||
3.  చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||
4.  పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవ||
5.  శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను ||క్రైస్తవ||
6.  కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను ||క్రైస్తవ||