← కీర్తనలు

608. మాతృదేశ సేవ

రాగం: హిందూస్థాని|తాళం: ఆది|రచయిత: మార్తాండ జ్ఞాన ప్రకాశము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో ||దేశ||
1.  దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు మనసుతో నాశతో సేవించుడి ||దేశ||
2.  నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ||
3.  వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ విధము లేక మేలు లేదు ||దేశ||
4.  ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో ||దేశ||
5.  ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని భువిని సేలు రాజు యేసుఁడే ||దేశ||