← కీర్తనలు

601. సాంవత్సరిక కృతజ్ఞతార్పణము

రాగం: గుల్ రోజు|తాళం: ఏక|రచయిత: మత్తయి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముఁడా వదనంబు లందు కో ప్రభో ||వందనం||
1.  ఇన్ని నాళ్లు ధరను మమ్ముఁ బ్రోచియుఁ గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వందనం||
2.  ప్రాత వత్సరంపుఁ బాప మంతయుఁ బ్రీతిని మన్నించి మమ్ముఁ గావుము నూత నాబ్దమనను నీదు నీతి నొసఁగు మా దాత క్రీస్తు నాధ రక్షకా ||వందనం||
3.  దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||
4.  కోఁతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతిఁ బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుఁడా ||వందనం||
5.  మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార మంతఁ ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||