కీర్తనలు

588. సంఘపు బడి ప్రాముఖ్యత

రాగం: హరికాంభోజి|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి ||సఖులారా||
1.  విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు ||సఖులారా||
2.  మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు ||సఖులారా||
3.  పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి ||సఖులారా||
4.  ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ బఠియింప దగుఁచిత్రముగ ||సఖులారా||
5.  మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు ||సఖులారా||
6.  శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని ||సఖులారా||
7.  ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ బ్రార్థింతము హితులారా ||సఖులారా||