కీర్తనలు

583. కోఁత పండుగ

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: గుంజా వెంకటరత్నము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుఁడి ||యెహోవ||
1.  ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ||
2.  రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది మీ రర్పించుఁడి ||యెహోవ||
3.  శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ||
4.  వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ||
5.  యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||