← కీర్తనలు

575. క్రైస్తవ దాతృత్వము

రాగం: సౌరాష్ట్ర|తాళం: ఆది|రచయిత: మోచర్ల రాఘవయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుఁడు ప్రేమించున్ వింతగ వలసిన దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||
1.  అత్యాసక్తితో నధికప్రేమతో నంధకార జను లందఱకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భుక్తులకు ||సంతోషముతో||
2.  వేదవాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||
3.  దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటిఁ దీర్చుటకై నిక్కపు రక్షణ నిద్ధరలో నలు ప్రక్కలలోఁ బ్రక టించుట కొఱకై ||సంతోషముతో||
4.  ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నిఁకను ||సంతోషముతో||
5.  భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు ను దారతతో శక్తికొలఁది మన భుక్తి నుండి యా సక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||