కీర్తనలు

573. క్రైస్తవ దాతృత్వము

రాగం: శంకరాభరణము|తాళం: అట|రచయిత: మోర్త ప్రకాశము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ ||దాతృ||
1.  శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ ||దాతృ||
2.  సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ ||దాతృ||
3.  గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ||దాతృ||
4.  సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృ||
5.  ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ||దాతృ||
6.  విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ||దాతృ||
7.  దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ||
8.  పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృ||
9.  వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ ||దాతృ||
10.  వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||