కీర్తనలు

571. దశమ భాగము

రాగం: హిందుస్థాని తోడి|తాళం: రూపకము|రచయిత: కూచిపూడి రాజరత్నము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||
1.  దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||
2.  పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||
3.  ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశమ||
4.  ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||
5.  దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||