పల్లవి:దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు రారమ్ము నీవె యిద్దానిని నెఱదాతవగుచు స ద్భావముతో నిచ్చితివి బహుమానముగ మాకు ||దేవా||
1. మా యింటి యజమానుండ వీవెసుమ్మి మా యింటి ప్రభుఁడ వీవె పాయక మా యింట భవదీయాభీష్టంబె శ్రేయోదాయకమగుచు సిద్ధిం చెడును గాక ||దేవా||
2. మా యాస్తిపాస్తులన్ని మా కబ్బె భవ దీయానుగ్రహ బలముచే నీయాననవ్వాని నీ యలఘ సేవకై న్యాయముగ నర్పింప నీయవె ఘన బుద్ధి ||దేవా||
3. నీవిచ్చు ధననిధులైన మా బిడ్డలు కేవలము నీ దాసులై భావివానిరి మణుల ఠేవనుద్భాసిల్ల నీవెవారిని భృశము ప్రోవుమాయువొసంగి ||దేవా||
4. రేపుమాపీ గృహునఁ బ్రోక్తములగుచు దీవించు ప్రార్థనముల లోపరహితంబులుగా ధూపధూమములట్లు నీ పాదయుగళి స మీపింప నిమ్మెపుడు ||దేవా||
5. ఏ రోగమును నెపుడేని మా మందిరపు ద్వారంబు చొరనీయక ఆరోగ్యభాగధే యంబిచ్చి మమ్ములను భూరికృపబ్దివై పోసింపుమను దినము ||దేవా||
6. ఇరుగుపొరుగు వారలతో సమాధాన పరతవసింపను నేర్పి కొఱగాని కలహములు త్వరపెట్ట నవ్వాని భరియింపఁదగు సహాన భావంబు మా కిమ్ము ||దేవా||
7. బీదసాదల కెల్లరకు మా గృహమెప్పు డాదరణాస్పదమై యుండ నీ దానాసారంబు నెఱవర్షించిన కొలఁది నౌదార్యగుణము మా యందుఁ బెంచుము సొరిది ||దేవా||
8. నక్కలకు బొరియలుండు దివి పక్షులకుఁ జక్కని గూళ్లునమరు నొక్కింత యిక్కనా కెక్కడలేదనిన చక్కని నరసుతమా సదనంబు నకు రమ్ము ||దేవా||
