← కీర్తనలు

532. యేసునకు స్తుతి

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: నరెళ్ల సమూయేలు సుబ్బయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతు||
1.  సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ ||చేతు||
2.  అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను బెంచు చున్న యేసుస్వామీ నీకే ||చేతు||
3.  విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా ||చేతు||
4.  చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||