కీర్తనలు

503. పరలోక భాగ్యము

రాగం: జంఝూటి|తాళం: ఏక|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు వారి కాశ యిందు లేదుగా ||పరములోన||
1.  వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన||
2.  ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ గంటి నీళ్లు దుడుచుఁగా ||పరములోన||
3.  అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుఁగా ||పరములోన||
4.  దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా ||పరములోన||
5.  అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన||