కీర్తనలు

501. క్రీస్తు మోక్ష ద్వారము

రాగం: తోడి|తాళం: అట|రచయిత: తూపిలి యోహాను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార ద్వారము ||శృంగార||
1.  పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ పెట్టు ||శృంగార||
2.  యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ పెట్టు ||శృంగార||
3.  అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను జేర్చు ||శృంగార||
4.  ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు ||శృంగార||