కీర్తనలు

479. క్రైస్తవ యాత్రికుఁడు

రాగం: తోడి|తాళం: ఆది|రచయిత: జె.ఈ.షార్మీ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు పట్టణం ||బిందు||
1.  పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్ చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు ||డిందు||
2.  మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందు||
3.  మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక మునను గ్రింది వన్ని వదలు దాము ||ఇందు||
4.  మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న నెగిరి నిన్నుఁ జేరుకొందు ||ఇందు||
5.  సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు జేతుఁ నొసఁగు విశ్రమం బతండె ||ఇందు||