← కీర్తనలు

470. Go, preach my Gospel

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము చాటించుఁడి యవశ్య మేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము. ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము శ్రీ యేసు నామము||
1.  కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చక్కని మార్గము||
2.  సమీపమందు నుండు నేమో చావుకాలము సదా నశించిపోవువారి కీ సుభాగ్యము విధంబుఁ జూపఁగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందము. ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము సత్య సువార్తను||