పల్లవి:
నీ చిత్తం బేను నీ చిత్తంబే నేను మట్టిని ఓ కుమ్మరీ! నీ కోర్కెదీర నన్ దీర్చుమా నీకు లొంగెదన్ ఓ ప్రభువా ||
1. నీ మార్గంబేను నీ మార్గంబే నేడు నన్ను పరిశోధించు శుద్ధిజేయుమో యేసూ నన్ను నీ సన్నిధిలో మోకరింతున్ ||
2. నీ కోర్కె యేసు నీ కోర్కెయే నే గాయంబొంది అలసితిన్ బాగుచేయు నన్ ముట్టిప్రభో నీకే సమస్త శక్తి నొప్పున్ ||
3. నీ యిష్టంబేను నీ యిష్టంబే నీ యాత్మతోడ నన్ నింపుమా నాయందెల్లరు క్రీస్తుంజూడన్ నీ యాధీనంబు నన్నుంచుకో
4. అనుపల్లవి:
్పుడు నేను నీ రీతిగాన్ తప్పకజేతు నో ప్రభువా ఇప్పుడే నీదు సేవ జేయున్ అప్పగింతు నా సమస్తంబు ||
