పల్లవి:
సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్
1. భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||
2. మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||
3. వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||
4. పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||
5. మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||
6. మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||
7. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టి||
