పల్లవి:
తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే యను శక్తి నీయుమీ ||తనువు||
1. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త వినయ పాదము లివిగో ||తనువు||
2. స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి పూర్ణముగ నింపు ||తనువు||
3. వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ జ్ఞానం బిదిగో ||తనువు||
4. నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ కీయ సింహాసనమౌ ||తనువు||
5. ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ నుండెదఁ ||తనువు||
