← కీర్తనలు

411. దైవసన్నిధి

రాగం: యదుకులకాంభోజి|తాళం: త్రిపుట|రచయిత: మత్తయి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ దేవ నేను నీ దాపున నుండెదన్ నీ దాపున నుండెదన్ నా దేవ నను లేపు నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట ||ఓ దేవ||
1.  బాటసారి లాగు నేఁడు భానుఁడు గ్రుంకి మేటి చీఁకటి గ్రమ్మినన్ నేటి విశ్రాంతికిఁ జోటు బండయైనన్ మాటిమాటికిఁ గలలో సూటిగా నినుఁదలఁతు ||ఓ దేవ||
2.  ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ కూర్మిచే నాకుఁ జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి ననుఁ బిలువ ||ఓ దేవ||
3.  నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేఁగట్టె దను గర్తా ||ఓ దేవ||
4.  సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట ||ఓ దేవ||