← కీర్తనలు

409. Rest of the weary

రచయిత: బర్నార్డ్ మాన్సెల

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మా శ్రమ లన్ని తీర్చితివి మాకు విశ్రాంతి నిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
1.  సందియ మంతఁ దీర్చితివి పూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
2.  కన్నీళ్లు నీవు తుడ్చితివి మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
3.  నీ చరణంబు నమ్మితిమి కరుణఁ జూపి ప్రోచితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!