← కీర్తనలు

395. ప్రభుని హత్తుకొనుట

రాగం: జంఝూటి|తాళం: అట|రచయిత: సి.జేమ్సు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ||
1.  మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ||
2.  ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనుమీ||
3.  సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి ||మనుమీ||
4.  చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల ||మనుమీ||
5.  బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ ||మనుమీ||
6.  నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి ||మనుమీ||
7.  అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ ||మనుమీ||
8.  అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ ||మనుమీ||