← కీర్తనలు

393. క్రీస్తును ఆశ్రయించుట

రాగం: శహన|తాళం: కరుజంపె

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితిఁ బట్టితిఁ బట్టితి ||నీ చరణములే||
1.  దిక్కిఁక నీవే చక్కఁగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||
2.  ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||
3.  న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచుఁ ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||
4.  భావము మార్చి నావెతఁ దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||
5.  చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||
6.  చుట్టుకొని యున్న శోధన లున్నఁ పట్టు విడఁ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||
7.  నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాఁచవే దాఁచవే దాఁచవే ||నీ చరణములే||
8.  యేసుని తోడ నెన్వరు సాటి దోసముఁ బాపును బాపును బాపును ||నీ చరణములే||