391. విశ్వాస విజయము

రాగం: కమాను • తాళం: అట • రచయిత: మురారి దావీదు
పల్లవి:విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ మొసంగును నిజము ||విశ్వాసమే||
1. భక్తుఁ డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగాఁ బాడుదును ||విశ్వాసమే||
2. మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద ముగఁగాంచు ||విశ్వాసమే||
3. ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపఁబడుదుము అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్ బుధులతో నొందుదుము ||విశ్వాసమే||
4. నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ ముందుము నిజము ||విశ్వాసమే||
5. పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగఁ జేయున్ సరగు నద్దానినే సంపాదించుము ప్రియుఁడా ||విశ్వాసమే||