కీర్తనలు

372. ప్రభు ప్రార్థన

రాగం: ఆనందభైరవి|తాళం: ఏక|రచయిత: విలియం డానన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్ను చుండు గాక సకల లోకము క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య ||ఓ మా తండ్రి||
1.  నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను ధర్మ మూర్తి సత్యవర్తి ||ఓ మా తండ్రి||
2.  నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప నీవె మాకు వేరె లేరు సుమ్ము ||ఓ మా తండ్రి||
3.  మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్ ||ఓ మా తండ్రి||