← కీర్తనలు

318. పాపపు టొప్పుకోలు

రాగం: హరికాంభోజి|తాళం: త్రిపుట|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా ||పాపి||
1.  కాపుమయ్యా ననుఁ గావు మయ్య నా పావ నయ్యా జీవమైన యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా ||పాపి||
2.  ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావు ||పాపి||
3.  ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితిఁ గరుణా శాలి వయ్యా నేఁ జాల నమ్మతిఁ గరుణా శాలి వయ్యా ||పాపి||
4.  మంటివాఁడ నే మంటివాఁడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని న్నంటువాఁడ నే నె న్నంటికైన ని న్నంటువాఁడ ||పాపి||
5.  శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత నునుచు ||పాపి||