పల్లవి:మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసున్ || మాధుర్యంపు నామము మోద మిచ్చు గానము వేద వాక్యసారము యేసు దివ్య యేసు ||
1. మీ పాప మెల్లఁ బోయెను మేలొందుఁ డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుఁడి యపార శాంతుఁ డేసు.
2. వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుఁడి మనం బుప్పొంగ యేసున్
3. ఆ రమ్యమైన నామము అణంచు నెల్ల భీతిన్ శరణ్యు లైన వారి నా దరించు నెంతో ప్రీతిన్
4. ఓ యన్నలారా పాడుఁడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ ప్రియాతి ప్రియుఁడేసు
5. ఓ పిల్లలారా కొల్వుఁడీ యౌన్నత్య రాజు నేనున్ తపించువారి దాతయౌ దయామయున్ శ్రీ యేసున్
6. శ్రీ యేసుకై యర్పించుఁడీ మీ యావజ్జీవనమును ప్రియంపు దాసులౌచును రయంబు గొల్వుఁడేసున్
